కేసీఆర్ సార్ బహుజనులను గుర్తించండి
సీఎం కేసీఆర్ సర్ మా నీలం మదన్నకి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక్క అవకాశం ఇవ్వండి.. ఇంటికో ఇంచార్జిగా ఉండి గెలిపించుకుంటామంటూ రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ సంఘాల నాయకులు, ప్రజలు, యువత కోరుతున్నారు.
దిశ పటాన్ చెరు: సీఎం కేసీఆర్ సర్ మా నీలం మదన్నకి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక్క అవకాశం ఇవ్వండి.. ఇంటికో ఇంచార్జిగా ఉండి గెలిపించుకుంటామంటూ రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ సంఘాల నాయకులు, ప్రజలు, యువత కోరుతున్నారు.కేసీఆర్ ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో బీసీ వర్గాలకు తగిన స్థానం కల్పించకపోవడంపై బీసీ వర్గాల నాయకులు గొంతెత్తుతున్నారు. సబ్బండ వర్గాల ప్రజల ప్రతినిధిగా నీలం మధు అసెంబ్లీకి వెళ్తే బడుగు, బలహీన వర్గాల ప్రజలకు తప్పక న్యాయం జరుగుతుందని నమ్ముతున్నారు. ఎన్నికల ప్రచారానికి తామంతా వచ్చి వెన్నుదన్నుగా నిలబడి ఇంటి ఇంటికి ప్రచారం చేసి గెలిపిస్తామని యువత నీలం మధు ముదిరాజ్ కు భరోసా ఇస్తున్నారు.