Maha Shivratri :శివరాత్రికి ముస్తాబవుతున్న గురుపాదగుట్ట దేవాలయం
క్రీస్తు శకం 16వ శతాబ్దంలో గురువు గురుపాదప్ప చే స్థాపించబడిన లింగం ఇచ్చట కలదు. శంకరంపేట నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం భక్తులను
దిశ, పెద్ద శంకరంపేట్: శుక్రవారం పెద్ద శంకరంపేట పరిధిలోని శ్రీ గురుపాదగుట్ట దేవాలయం శివరాత్రికి ముస్తాబవుతుంది.
స్థల పురాణం: క్రీస్తు శకం 16వ శతాబ్దంలో గురువు గురుపాదప్ప చే స్థాపించబడిన లింగం ఇచ్చట కలదు. శంకరంపేట నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం భక్తులను ఇట్టే ఆకట్టుకుంటుంది. పక్కనే ఉన్న మైసమ్మ చెరువు అందాలు ప్రకృతి రమణీయత ఈ క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుంది. రాణి శంకరమ్మ చే పూజలు అందుకున్న మహిమగల క్షేత్రం ఈ దేవాలయం. శంకరంపేట గ్రామానికి చెందిన గాండ్ల రాజయ్య ఆలయం పక్కకు ఒక సత్రాన్ని నిర్మించినాడు.. కాలక్రమేని ఈ ఆలయం శిథిలావస్థలోకి చేరుకోగా పెద్ద శంకరంపేట్ గ్రామానికి చెందిన బలరాం లక్ష్మణ్ కుమారుడు బలరాం సంగమేశ్వర్ ఈ ఆలయ పునర్నిర్మాణానికి పూనుకొని పూర్తి చేశారు. అనునిత్యం వేద బ్రాహ్మణులు చే పూజలు అందుకుంటూ దిన దినాభివృద్ధి చెందుతూ భక్తుల కోరికలను తీర్చే దేవాలయంగా పూజలు అందుకుంటుంది. ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం ఈ దేవాలయంలో నిర్వహించబడును.
శివరాత్రి ఉత్సవ కార్యక్రమాలు..
18వ తేదీ త్రయోదశి నాడు రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలం నందు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించబడును. 21వ తేదీ నాడు పుణ్యాహవచనం, శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి రుద్రాభిషేకం, ఆకుల పూజ ,అన్న పూజ. 22వ తేదీ నాడు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం.. మధ్యాహ్నం ఒకటి గంటల నుండి అన్నదాన కార్యక్రమం సాయంత్రం బండ్ల ఊరేగింపు కార్యక్రమం జరుపబడునని ఆలయ పూజారి దత్తాత్రేయ స్వామి ఒక ప్రకటనలో తెలిపారు.