farmers : రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని రైతులు కొనుగోలు కేంద్రాలు వినియోగించుకోవాలని సిద్ధిపేట డీసీసీబీ చైర్మన్ గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నర్సారెడ్డి అన్నారు.

Update: 2024-10-27 08:56 GMT

దిశ, తూప్రాన్ : రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని రైతులు కొనుగోలు కేంద్రాలు వినియోగించుకోవాలని సిద్ధిపేట డీసీసీబీ చైర్మన్ గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నర్సారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ ప్రాథమిక వ్యవసాయ కేంద్రం మనోహరాబాద్ మండల పరిధిలోని దండుపల్లిలో పాక్స్ చైర్మన్ మెట్టు బాలకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు ముఖ్యఅతిథిగా నర్సారెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం 500 బోనస్ క్యాబినెట్ లో ప్రకటించడంతో రైతుకు సంతోషంగా ఉన్నారని తెలిపారు.

కొనుగోలు కేంద్రాలు ద్వారా రైతుకు మంచి మద్దతు ధరకు ధాన్యం అమ్మకాలు చేసుకొని వెంటనే కథలో డబ్బులు వేస్తుందని తెలిపారు. పాక్స్ చైర్మన్ మెట్టు బాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు వినిగించుకుని లబ్ధి పొందాలని కోరారు. ప్రాథమిక వ్యవసాయ కేంద్రం ద్వారా రైతులు రుణాలు కూడా పొందొచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సుభాష్ గౌడ్, పాక్స్ డైరెక్టర్ జావేద్ పాషా, నాయకులు శ్రీనివాస్ గౌడ్, మద్దూరి నాగరాజు, శ్రీహరి, బిక్షపతి, రమేష్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News