ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాల పేరిట ఘరానా మోసం.. నిందితుడి అరెస్ట్
ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్న
దిశ,సిద్దిపేట ప్రతినిధి : ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తికి సిద్దిపేట వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన జోరు వంతల సత్యనారాయణ అల్వాల్ లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా కేంద్రం ఓ కార్యాలయం ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మ పలికి వర ప్రసాద్ అనే వ్యక్తి వద్ద రూ.4 లక్షల 15 వేలు, బక్కోళ్ల అశోక వద్ద రూ.1 లక్ష 50 వేలు వసూలు చేశారు. తదుపరి కార్యాలయం మరో చోటకు మార్చడం వల్ల ఖర్చుల కోసం మరో రూ.1 5 వేలు తీసుకున్నారు. తదుపరి రెండు నెలల తర్వాత ఉద్యోగం గురించి ఆరా తీయగా ప్రభుత్వం మారిందని మాయమాటలు చెబుతూ కాలయాపన చేయడం తో డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితులు కోరారు.
దీంతో సత్యనారాయణ డబ్బులు అడిగితే చంపేస్తానని బెదిరించడంతో బాధితులు పోలీస్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు లో భాగంగా నిందితుడిని పట్టుకొని విచారించి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. నిందితుడి వద్ద టీవీ 5 ఐడి కార్డు, యాంటీ కరప్షన్ ఇంటెలిజెంట్ కమిటీ ఐడి కార్డ్, మరో రెండు రకాల ఐడి కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సత్యనారాయణ బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పె వ్యక్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు.