బీజేపీకి మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి రాజీనామా
దిశ, మెదక్: మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ళ శశిధర్ రెడ్డి బీజేపీ పార్టీ
దిశ, మెదక్: మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ళ శశిధర్ రెడ్డి బీజేపీ పార్టీ సభ్యత్వానికి,రాష్ట కార్యవర్గ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేశారు. గత కొద్ది రోజులుగా బీజేపీ పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. రాష్ట బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మెదక్ జిల్లా పాదయాత్రకు దూరంగా ఉన్నారు. ఈ విషయాన్ని గతంలోనే దిశ ప్రచురించిన విషయం తెలిసిందే. 2 ,3 రోజుల్లో తన కార్యాచరణ ప్రకటించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి దిశతో చెప్పారు.