ఏబీవీపీ సేవలు అభినందనీయం : ప్రజ్ఞా పరాండే
కరోనా సమయంలో ఏబీవీపీ సేవలు అభినందనీయం అని నేషనల్
దిశ,సిద్దిపేట అర్బన్ : కరోనా సమయంలో ఏబీవీపీ సేవ అభినందనీయం అని నేషనల్ లేబర్ ఇన్‌స్టిట్యూట్ న్యూఢిల్లీ చీఫ్ అడ్వైజర్ ప్రజ్ఞా పరాండె అన్నారు. ఎబీవీపీ 43 వ రాష్ట్ర మహాసభల్లో భాగంగా బుధవారం శ్రీ జనమంచి గౌరీశంకర్ స్ఫూర్తి జ్ఞాపిక గా గౌరీజి యువ పురస్కారం అవార్డు ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజ్ఞా పరాండే మాట్లాడుతూ... గౌరీజీ స్పూర్తితో జాతి పునర్ నిర్మాణానికి పాటుపడాలని సూచించారు.
ఈ క్రమంలో చదువును అశ్రద్ధ చేయవద్దని అన్నారు. నక్సలైట్లు వామపక్షవాదులు స్వైర విహారం చేస్తున్న రోజుల్లో భుజానికి ఒక జోలె వేసుకుని రాష్ట్రమంతా పర్యటిస్తూ గౌరీజీ విద్యార్థుల్లో జాతీయ భావాన్ని పెంపొందించాడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సామాజిక సేవలో రాణిస్తున్న 40 వ సంవత్సరాల లోపు యువతీ యువకులకు రూ. 50 వేల నగదు పురస్కారం ప్రశంసా పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.