‘4వేలైన్ రోడ్ల నిర్మాణానికి నిధులను మంజూరు చేయండి’
4వేలైన్ రోడ్ల నిర్మాణానికి నిధులను మంజూరు చేయాలని
దిశ,దుబ్బాక : 4వేలైన్ రోడ్ల నిర్మాణానికి నిధులను మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు.బుధవారం మెదక్ జిల్లాలోని పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి పాపన్నపేట మండలంలోని ఏడుపాయల అమ్మవారి ఆలయానికి విచ్చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గంలోని రోడ్డు పనుల విస్తీర్ణకు దుబ్బాక మండలం హబ్షీపూర్ చౌరస్తా నుంచి దుబ్బాక అంబేద్కర్ చౌరస్తా వరకు 4వేలైన్ రోడ్డు నిర్మాణానికి రూ. 20 కోట్లు,శిలాజీ నగర్ నుంచి ఏనుగుర్తి, బొప్పాపూర్ మీదుగా వెళ్లే రహదారి నిర్మాణానికి రూ. 40 కోట్ల నిధుల మంజూరు చేసి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.