బీఆర్ఎస్ పై కోపంతో ప్రాజెక్టు ఆపింది..: ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ పై కోసం తో కాళేశ్వరం ప్రాజెక్టు నిలిపి రైతులకు

Update: 2024-12-25 12:42 GMT

దిశ, మెదక్ ప్రతినిధి : బీఆర్ఎస్ పై కోసం తో కాళేశ్వరం ప్రాజెక్టు నిలిపి రైతులకు అన్యాయం చేస్తుందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. మెదక్ లోని వందేళ్ల చర్చి క్రిస్మస్ ఉత్సవాల్లో కవిత తో పాటు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, యాదవ రెడ్డితో కలిసి చర్చిని దర్శించుకొని బుధవారం ప్రార్థనలు చేశారు. అనంతరం బీ అర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మెదక్ లో పంటలకు నీరందించి సస్యశ్యామలం చేశాం, కాళేశ్వరం నీరు అందితే పంటలకు ఇబ్బంది వచ్చేది కాదు కానీ బీఆర్ఎస్ పై ఉన్న కోపం తో నేరండకుండ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. మా పై కోపంతో ప్రజలకు అన్యాయం చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు.

సీఎం మెదక్ వస్తే ఏదో అభివృద్ధి జరుగుతుందని ఆశ పడ్డారు, కానీ సీఎం వస్తే ఏమైనా వచ్చిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో క్రైమ్ 40 శాతం కు పెరిగి మహిళలకు భద్రత కల్పించడం లేదని అన్నారు. మహిళలకు ఇస్తామన్న పథకాలు ఇవ్వడం లేదని, మహిళా లక్ష్మి పథకం, పెళ్లికి బంగారం, స్కూటీ పై షరతులు లేకుండా కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా ఎలాంటి నిబంధనలు లేకుండా అందించాలని, సన్న తో పాటు అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెదక్, బోధన్, మెట్టుపల్లి చక్కెర పరిశ్రమలు తెరిపిస్తామని ఇచ్చిన హామీ పై ఎందుకు కదలిక లేదని ప్రశ్నించారు. అధికారంలోకి రావడానికి అడ్డమైన కోతలు కోశారని, కోతలు మానేసి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అన్నారు.

మెదక్ లో చర్చి నిర్మాణం జరిగిన పదేళ్ళ ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. వందేళ్ల ఉత్సవాల్లో వచ్చి దర్శనం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. క్రిస్టియన్ తో బీఆర్ఎస్ కు పేగు బంధం ఉందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం కోసం చర్చల్లో ప్రార్థనలు చేశారని చెప్పారు. బీ అర్ ఎస్ పాలనలో జిల్లా కేంద్రం ఏర్పాటు జరిగిందని, ఏడుపాయల దేవస్థానం, పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా బఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, వంజరి. జయరాజ్, మామిళ్ల ఆంజనేయులు, ఆర్కే. శ్రీనివాస్ బీఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.


Similar News