అగమ్యగోచరంగా ప్రజారోగ్యం..: ఎమ్మెల్యే హరీష్ రావు

ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు అస్తవ్యస్తంగా ఉన్నాయని

Update: 2024-12-25 12:12 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు అస్తవ్యస్తంగా ఉన్నాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. అదే విధంగా రూ.2 లక్షల రూపాయల ఎల్ వో సి ని అందజేశారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ...కేసీఆర్ ప్రభుత్వం లో ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీఠ వేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు అస్తవ్యస్తం అయ్యాయని ఆవేదన చేశారు. కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్లు బంద్ చేశారని, ప్రజా ఆరోగ్యం పడ కేసింది అన్నారు.

ఏ ఆపద వచ్చిన నేను అందుబాటులో ఉంటానని, ప్రైవేట్ ఆసుపత్రి లో ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు సీఎం ఆర్ ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తానని చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందిస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలో 143 మందికి 31 లక్ష 67 వేల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. అదేవిధంగా ఎన్సాన్ పల్లి గ్రామానికి చెందిన కేమ్మసారం లక్ష్మి నిమ్స్ లో చికిత్స కోసం అవసరమగు ఖర్చు కు 2 లక్షల రూపాయల ఎల్ వో సినీ హరీష్ రావు అందజేశారు. అదే విధంగా నంగునూరు మండలానికి చెందిన మోతే రాజు కుటుంబానికి ఆటో కో ఆపరేట్ సొసైటీ ఆధ్వర్యంలో మంజూరైన రూ.2 లక్షల ఇన్సూరెన్స్ చెక్ ను హరీష్ రావు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News