త్రిబుల్ ఆర్ సర్వేను అడ్డుకున్న రైతులు
త్రిబుల్ ఆర్ సర్వేను రైతులు అడ్డుకున్నారు.
దిశ, శివ్వంపేట : త్రిబుల్ ఆర్ సర్వేను రైతులు అడ్డుకున్నారు. శనివారం మండలంలోని రత్నాపూర్ గ్రామంలో త్రిబుల్ ఆర్ సర్వే నిర్వహించేందుకు వచ్చిన ఆఫీసర్లను సర్వే చేయొద్దని రైతులు అడ్డుకున్నారు. రైతులకు ఆఫీసర్లు చెప్పిన వినకపోవడంతో ఆర్డీవో జగదీష్ రెడ్డి చేరుకొని నచ్చజెప్పిన రైతులు వినలేదు. ఆర్డీవో ముందే రైతులు మేము భూములు పోతే ఎలా బతకాలంటూ భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్నామని భూములు కోల్పోయిన రైతులకు భూమికి బదులు భూమి ఇవ్వాలని, లేదంటే ఎకరాకు 2 కోట్ల రూపాయలు ఇస్తేనే భూమి ఇస్తామంటూ రైతులు వాపోయారు. భూమికి బదులు భూమి ఇవ్వకుండా సర్వే నిర్వహిస్తే ప్రాణాలు పోయినా సరే భూమి ఇవ్వమంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఆఫీసర్లు నచ్చచెప్పిన వినకపోవడంతో సర్వే నిర్వహించకుండా ఆఫీసర్లు వెళ్లిపోయారు.