కాళేశ్వరం నీళ్లతో రైతులు సుభిక్షంగా ఉన్నారు : ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో నేడు వ్యవసాయం పండగ అయ్యిందని, కాళేశ్వరం నీళ్లతో రైతులు సుభిక్షంగా ఉన్నారని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.
దిశ, జమ్మికుంట : సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో నేడు వ్యవసాయం పండగ అయ్యిందని, కాళేశ్వరం నీళ్లతో రైతులు సుభిక్షంగా ఉన్నారని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల భాగంగా శనివారం రైతు దినోత్సవ వేడుకలను రైతు వేదికల వద్ద ఘనంగా నిర్వహించారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంట రైతు వేదిక వద్ద కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడక ముందు రైతులు కరెంటు కోతలతో ఆగమయ్యేవారని తెలిపారు.
నేడు అలాంటి పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. అదేవిధంగా జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ రైతు వేదిక వద్ద జమ్మికుంట జడ్పీటీసీ శ్రీరామ్ శ్యాం పాల్గొని మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతుబంధు పథకంతో ఎకరాకు రూ.5 వేలు చొప్పున ఇస్తుందని గుర్తు చేశారు. అదేవిధంగా ఇల్లందకుంట మండలంలోని రైతు వేదికల వద్ద స్థానిక నేతలు రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ సభ్యులు, పీఏసీఎస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ప్రత్యేక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.