అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండాలి : జిల్లా కలెక్టర్

అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని జిల్లా కలెక్టర్

Update: 2023-09-18 14:10 GMT

దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. సోమవారం ఓటరు నమోదు, జాబితా సవరణ తదితర అంశాలపై రెవెన్యూ డివిజనల్ అధికారులు, తాసిల్దారులు, మున్సిపల్ కమిషనర్లు, బి ఎల్ ఓ సూపర్వైజర్లు, తదితరులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు నమోదు, మార్పులు, సవరణలకు ( సెప్టెంబర్ 19) రేపు ఒక్కరోజు మాత్రమే అవకాశముందని, అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కళాశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులందరూ ఓటరుగా నమోదు అయ్యేలా చూడాలన్నారు. అర్హులు ఎవరు ఓటరుగా నమోదు కాకుండా మిగలరాదన్నారు. జిల్లాలో ఓటరు నమోదు శాతం పెరిగిందన్నారు.

18 -19 సంవత్సరాల వయస్సు ఓటర్ల నమోదు శాతం మరింత పెంచేలా దృష్టి సారించాలన్నారు. దివ్యాంగ ఓటర్లను మార్కింగ్ చేయాలని పి డబ్లు డి అధికారి సంధ్యారాణి కి సూచించారు. ఓటరు నమోదుకు ఒకే ఒక్క రోజు మిగిలి ఉన్నందున, బీఎల్వోలకు, బి ఎల్ ఓ సూపర్వైజర్ల కోఆర్డినేషన్ తో ఆయా ఫారాలు తీసుకోవడంపై దృష్టి సారించాలన్నారు. వచ్చిన ఫారాలన్ని, సెప్టెంబర్ 19 (రేపు) సాయంత్రం నుండి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. డూప్లికేషన్ లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ మాధురి, డిఆర్ఓ నగేష్, ఈ ఆర్ ఓ లు, ఏ ఈ ఆర్ వో లు, బి ఎల్ ఓ సూపర్వైజర్లు, మున్సిపల్ కమిషనర్ లు, తదితరులు పాల్గొన్నారు.


Similar News