ఏడుపాయల హుండీ ఆదాయం రూ.41.96 లక్షలు

పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గ మాత ఆలయ

Update: 2024-12-21 12:01 GMT

దిశ, పాపన్నపేట : పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గ మాత ఆలయ హుండీని దేవాదాయ, ధర్మాదాయ శాఖ సహాయక కమిషనర్, హుండీ ఇంచార్జ్ సుధాకర్ రెడ్డి సమక్షంలో శనివారం ఆలయ సమీపంలో ఉన్న గోకుల్ షెడ్ లో లెక్కించారు. సిరిసిల్లకు చెందిన రాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు, ఆలయ సిబ్బంది లెక్కించారు. గడిచిన 59 రోజుల హుండీని లెక్కించగా రూ.41,96,612 ఆదాయం సమకూరింది. బంగారం, వెండి ఆభరణాలను తిరిగి హుండీలోనే వేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. స్థానిక ఎస్సై శ్రీనివాస్ గౌడ్, సిబ్బంది ఆధ్వర్యంలో పర్యవేక్షణ కొనసాగింది.


Similar News