జగ్గారెడ్డి రాకుంటే సచ్చిపోతా..33/11కేవీ స్తంభం ఎక్కి వ్యక్తి హల్చల్
జగ్గారెడ్డి రావాలి లేకుంటే స్తంభం నుంచి కిందకు దూకి చచ్చిపోతాను అంటూ ఓ వ్యక్తి 33/11 కెవి విద్యుత్ స్తంభానికి హల్చల్ చేశాడు.
దిశ, సంగారెడ్డి : జగ్గారెడ్డి రావాలి లేకుంటే స్తంభం నుంచి కిందకు దూకి చచ్చిపోతాను అంటూ ఓ వ్యక్తి 33/11 కెవి విద్యుత్ స్తంభానికి హల్చల్ చేశాడు. శనివారం సంగారెడ్డి లోని రాజంపేటకు చెందిన చంద్రమౌళి పట్టణంలోని విద్యుత్ కార్యాలయం ముందు గల విద్యుత్ స్తంభాన్ని ఎక్కాడు. జగ్గారెడ్డి వచ్చి తనతో మాట్లాడితేనే తాను కిందకు దిగుతానని లేనిచో స్తంభం నుంచి దూకి చనిపోతానని ఓ కాగితాన్ని కిందికి రాసి వదిలాడు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు చంద్రమౌళి కి సముదాయించిన వినకుండ స్తంభం నుంచి కిందకు దిగడం లేదు. దీనిపై కాంగ్రెస్ నాయకులు విషయం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. దీంతో జగ్గారెడ్డి విద్యుత్ కార్యాలయం వద్దగల 33/11 కేవీ విద్యుత్ స్తంభం వద్దకు వచ్చి నీకేమి కావాలో నేను ఇస్తాను నీవు కిందకు దిగు అని తెలపడంతో చద్రమౌళి కిందకు దిగారు. కిందకు వచ్చిన వ్యక్తితో నీకేమి కావాలన్న ఇస్తాను..స్తంభం ఎక్కి ఇబ్బంది ఎందుకు పెడుతున్నావు..తాగావు నీకు ఏమైనా అయితే ఏంటి పరిస్థితి అని సముదాయించారు. కిందకు వచ్చిన చంద్రమౌళిని పోలీసులు సంగారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్ కు తీసుకుపోయారు.