ఎన్యూమరేటర్లు నిర్లక్ష్యానికి తావు లేకుండా అన్ని వివరాలు సేకరించాలి

ఎన్యూమరేటర్లు ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వేలో అన్ని వివరాలు సేకరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు.

Update: 2024-11-10 11:28 GMT

దిశ, నర్సాపూర్ : ఎన్యూమరేటర్లు ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వేలో అన్ని వివరాలు సేకరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. ఆదివారం నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించారు. సర్వే లో ఎన్యూమరేటర్లు వివరాలు సేకరించే, ఫారంలలో నమోదు చేసే విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి సమర్థవంతంగా నిర్వహించుటకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలోనే ప్రథమంగా చేపట్టిన ఈ ఇంటింటి కుటుంబ సర్వేలో ప్రతి ఒక్క కుటుంబం పాల్గొనే విధంగా ప్రతిరోజు ప్రజలను చైతన్యపరిచే లా విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. ఏ ఇంటిని కూడా వదలకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు.ప్రతిరోజు సర్వే పూర్తి కాగానే సాయంత్రం ఐదు గంటలకు గూగుల్ షీట్ లో అప్లోడ్ ప్రారంభించాలని సాయంత్రం 6 గంటలకు పూర్తి సమాచారం జిల్లా కేంద్రానికి అందాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రామకృష్ణారావు, ఎన్యుమరేటర్లు తదితరులు పాల్గొన్నారు.


Similar News