దిశ ఎఫెక్ట్… అక్రమ మట్టి తవ్వకాలపై తహసీల్దార్ సీరియస్
దిశ దినపత్రికలో శనివారం ప్రచురితమైన మట్టి అక్రమ తవ్వకాలు కథనంపై మండల తహసీల్దార్ గంగాభవాని స్పందించారు
దిశ, గుమ్మడిదల :- దిశ దినపత్రికలో శనివారం ప్రచురితమైన మట్టి అక్రమ తవ్వకాలు కథనంపై మండల తహసీల్దార్ గంగాభవాని స్పందించారు. ఈ సందర్భంగా సంబంధిత గుమ్మడిదల గ్రామంలోని సర్వే నెంబర్ 109 ప్రభుత్వ భూమిలో అక్రమ మట్టి తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని రెవెన్యూ అధికారులు సిబ్బందితో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమిలో నుంచి ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు నిర్వహిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానుకోవాలని లేకుంటే క్రిమినల్ కేసులను సైతం నమోదు చేస్తామని హెచ్చరించారు. అర్ధరాత్రి సమయంలో సంబంధిత స్థలంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించవలసిందిగా మండల ఎస్ఐ కు ఆదేశాలను జారీచేశారు.