ఈఎంఆర్ఐలో ఉద్యోగ నియామకాలు

ఈఎంఆర్ఐ (108) సంస్థలో ఈఎంటీ (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్) ఉద్యోగాల కోసం ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ జాన్ షాహిద్ తెలిపారు.

Update: 2023-05-18 09:15 GMT

దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ : ఈఎంఆర్ఐ (108) సంస్థలో ఈఎంటీ (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్) ఉద్యోగాల కోసం ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ జాన్ షాహిద్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఒక జీరాక్స్ సెట్ తో 20న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు. బీఎస్సీ (బీజెడ్సీ), బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, బీ ఫాం, డీ ఫాం, డీఎంఎల్టీ అర్హతలు కలిగి ఉండాలన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలోని 108 కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. వివరాలకు 7569026145 నెంబరు కు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించాలని తెలిపారు.

Tags:    

Similar News