'ఏడుపాయల' టెండర్ ఆదాయం రూ. 12.85 లక్షలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గా భవాని మాతా ఆలయం వద్ద జరిగే మాఘ అమావాస్య, మహా శివరాత్రి జాతరలో భక్తుల వినోద ప్రదర్శనశాల ఏర్పాటుకు, కొబ్బరి ముక్కల పోగు చేసుకొనే హక్కు కోసం శుక్రవారం పాడిన వేలం ద్వారా రూ. 12లక్షల 85వేల ఆదాయం వచ్చినట్లు ఆలయ చైర్మన్ బాలా గౌడ్, ఆలయ ఈవో శ్రీనివాస్ లు వెల్లడించారు.

Update: 2022-12-30 13:04 GMT

దిశ, పాపన్నపేట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గా భవాని మాతా ఆలయం వద్ద జరిగే మాఘ అమావాస్య, మహా శివరాత్రి జాతరలో భక్తుల వినోద ప్రదర్శనశాల ఏర్పాటుకు, కొబ్బరి ముక్కల పోగు చేసుకొనే హక్కు కోసం శుక్రవారం పాడిన వేలం ద్వారా రూ. 12లక్షల 85వేల ఆదాయం వచ్చినట్లు ఆలయ చైర్మన్ బాలా గౌడ్, ఆలయ ఈవో శ్రీనివాస్ లు వెల్లడించారు. జాతరలో భక్తుల వినోద ప్రదర్శనశాల ఏర్పాటుకు మెదక్ కు చెందిన ముజీబ్ రూ. 9లక్షల10వేలకు హెచ్చు పాట పాడి కైవసం చేసుకున్నాడు. గత వేలం పాటలో నాగసాన్ పల్లికి చెందిన బొమ్మ ప్రసాద్ రూ.14లక్షల హెచ్చు పాట పాడి సమయానికి డబ్బులు చెల్లింపులు చేయక పోవడంతో వేలం పాట దారుడి దారవత్తు సొమ్ము కైవసం చేసుకున్నారు. తిరిగి వేలం పాట నిర్వహించగా రూ. 9లక్షల 10వేల ఆదాయం సమకూరింది. దేవస్థానం వద్ద కొబ్బరి ముక్కల పోగు చేసుకొనే హక్కు కోసం వేలం పాట నిర్వహించగా నాగసాన్ పల్లి గ్రామానికి చెందిన తలారి రాంచందర్ రూ. 3లక్షల 75వేలకు హెచ్చు పాట పాడి కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ధర్మ కర్తలు వెంకటేశం, చక్రపాణి, మనోహర్, మోహన్ రావు, శ్రీనివాస్ రావు, పెంటయ్య, బాగా రెడ్డి, యాదయ్య, సాయిలు, సిద్దయ్య, మనెమ్మ కిషన్, ఆలయ సిబ్బంది మధుసూధన్ రెడ్డి, సూర్య, శ్రీనివాస్, రవి వీర్ కుమార్, శ్రీనివాస్ శర్మ, ప్రతాప్ రెడ్డి, మహేశ్, నరేష్, బ్రహ్మ చారి తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News