కొడకండ్లలో తాగునీటి తండ్లాట.. నీటిశుద్ధికేంద్రానికి మోక్షం ఎప్పుడో..?

ఆ గ్రామంలో సుమారుగా 3000 జనాభా జీవనం కొనసాగిస్తున్నారు.

Update: 2024-10-09 10:48 GMT

దిశ,గజ్వేల్/కొండపాక : ఆ గ్రామంలో సుమారుగా 3000 జనాభా జీవనం కొనసాగిస్తున్నారు. కొండపాకలో కూతవేటు దూరంలో మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రం ఉన్నప్పటికీ నిత్యం స్థానికులు తాగునీటి కోసం గోస పడుతున్నారు. గజ్వేల్ మండలం కొడకండ్లలో నీటి శుద్ధి కేంద్రం శిథిలావస్థకు చేరడంతో నిరుపయోగంగా మారింది. పాలకవర్గం పట్టించుకోని పరిస్థితి , ప్రజలకు శాపంగా మారింది.ఇదే అదనుగా భావించి ప్రైవేట్ ప్లాంట్స్ వారు దండుకుంటున్నారు. ఎవరిది ఈ పాపం ....అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలకవర్గం పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు.

నీటి గోస పై ప్రత్యేక కథనం....

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిధిలోని కొడకండ్ల గ్రామంలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని కొంతకాలంగా వాటర్ ప్లాంట్ శిథిలావస్థకు చేరడంతో నిరుపయోగంగా మారింది. స్థానిక ప్రజాప్రతినిధులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రైవేటు ప్లాంట్ వారు డబ్బులు దండుకుంటున్నారు. దాదాపు 2500 నుంచి 3000 జనాభా కలిగి గజ్వేల్ మండలం లోని జనాభా ప్రాతిపదికన ఉన్న పెద్ద గ్రామాల్లో కొడకండ్ల ఒకటి, పారిశ్రామిక ప్రాంతం కూడా. దాతల సహాయంతో గ్రామంలో గత 10 సం " కిందట నీటి శుద్ధి కేంద్రాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం పక్కన ఏర్పాటు చేశారు .గతంలో గ్రామ పంచాయతీ బాధ్యత తీసుకొని ,గ్రామ సభ ఏర్పాటు చేసి బహిరంగ గా వేలం వేసి ఆ వేలం పాటలో గెలిసిన వారికి నీటి శుద్ధి కేంద్రం నిర్వహణ బాధ్యతను అప్పగించేది. వేలం లో వచ్చిన డబ్బును విడతల వారీగా వాసులు చేస్తూ గ్రామ పంచాయతీ అభివృద్ధి పనుల లో ఖర్చు చేసేది.

వేలం పాటలో గెలిచిన వ్యక్తి యొక్క కుటుంబం కూడా కొంత ఆర్దికంగా నిలదొక్కుకుని ఆ కుటుంబానికి ఉపాధి దొరికేది. దీంతో చుట్టూ ప్రక్కల గ్రామాలు అయిన రిమ్మనగూడ,రాయవరం,తిమ్మాపూర్, పిటి వెంకటపుర్ , రామచంద్రపుర్ , గ్రామాల ప్రజలకు తాగునీరు అందేవి.కానీ నేటి గ్రామ పంచాయతీ పాలక వర్గం అధికారుల నిర్లక్ష్యం కారణంగా త్రాగు నీటి శుద్ధి కేంద్రం ఉపయోగానికి నోచుకోకుండా శిధిల వ్యవస్థలో కి పోయింది. గత 3 సం లుగా దాని పట్టించుకునే నాథుడే కరువయ్యారు.స్థానిక పరిశ్రమలు ఇస్తున్న నిధులు ఎటు పోతున్నయో ?తెలియని పరిస్థితి ,అధికారుల నిర్లక్ష్యంగా గ్రామం లో ఏకంగా 3 ప్రైవేట్ త్రాగు నీటి శుద్ధి కేంద్ర లు పుట్టుకొచ్చాయి.ప్రభుత్వ అధికారులు, పాలక వర్గం ఇక నైనా మేల్కొని గ్రామంలో నీటి శుద్ధి కేంద్రంను ఉపయోగానికి తేవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

వాటర్ ప్లాంట్ ను పట్టించుకునే నాథుడే లేడు : కర్నాల గణేష్ ,కొడకండ్ల గ్రామం

గతంలో నిర్మించిన వాటర్ ప్లాంట్ చుట్టుపక్కల గ్రామాలకు కూడా అందుబాటులో ఉండేది రూ. 5 కే 20 లీటర్ల నీరు అందించడం ద్వారా అందరూ కూడా గ్రామానికి వచ్చి నీరు తీసుకెళ్లేవారు. గ్రామ పంచాయతీ వేలం ద్వారా వాటర్ ప్లాంట్ ను ఎవరో ఒకరు దక్కించుకునేవారు.ఆ విధంగా ఒకరికి ఉపాధి దొరుకుతుండేది.దానితోపాటు తక్కువ ధరకే 20 లీటర్ల నీళ్లు వస్తుంది. గత 5 నుండి 6 సంవత్సరాలుగా ఈ వాటర్ ప్లాంట్ ను పట్టించుకునే నాథుడే లేడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాటర్ ప్లాంటును ఉపయోగంలోకి తేవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.


Similar News