FIR Filed: సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిపై కేసు నమోదు..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి (Venktramireddy)పై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Update: 2024-11-29 04:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి (Venktramireddy)పై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహించారనే అభియోగంతో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే, త్వరలో ఆంధ్రప్రదేశ్ సచివాలయం (Andhra Pradesh Secretariat) క్యాంటీన్ కమిటీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో వెంకట్రామి‌రెడ్డి ఉద్యోగులకు మందు పార్టీ ఇచ్చారని తెలుస్తోంది. తాడేపల్లి (Thadepally)లోని ఓ గార్డెన్‌లో మద్యం, విందు భోజనం ఏర్పాటు చేశాడని పోలీసులు తెలిపారు. అయితే, ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వివరణ ఇచ్చారు. తాము నిర్వహించింది మందు పార్టీ కాదని తెలిపారు. బయటి నుంచి వచ్చిన కొందరు బాటిల్స్ తెచ్చుకున్నారని అన్నారు. మొత్తం 150 మంది విందుకు హాజరయ్యారని.. వారందరికీ మూడు, నాలుగు బాటిళ్లు సరిపోతాయా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తమపై కక్ష సాధింపునకు పాల్పడుతోందని.. మూడుకు మించి బాటిల్స్ ఉంటే చట్ట ప్రకారం నేరమని వెంకట్రామిరెడ్డి అన్నారు.  

Tags:    

Similar News