క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు : సీపీ అనురాధ

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ లకు పాల్పడితే కేసులు నమోదు చేసి చట్ట

Update: 2025-03-24 13:12 GMT
క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు : సీపీ అనురాధ
  • whatsapp icon

దిశ, సిద్దిపేట ప్రతినిధి : ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ లకు పాల్పడితే కేసులు నమోదు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు కమిషనర్ డా. అనురాధ హెచ్చరించారు. సోమవారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. యువత బెట్టింగ్స్ వేసి డబ్బులు నష్టపోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. యువత ఆలాంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. వినోదం కొరకు ఆడే ఆటను వినోదం గానే చూడాలన్నారు.

యువకులు క్రికెట్ బెట్టింగ్ మాయలో పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని అన్నారు. క్రికెట్ బెట్టింగ్ పాల్పడం కూడా అత్యంత ప్రమాదకరం, నేరం అన్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ పై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తల్లిదండ్రులు సైతం అప్రమత్తంగా ఉండి పిల్లలు బెట్టింగ్ పాల్పడకుండా చూసుకోవాలన్నారు. క్రికెట్ బెట్టింగ్, ప్లేయింగ్ కార్డ్స్, బెట్టింగ్ యాప్స్, అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా నిర్వహించిన, కార్యక్రమాలకు పాల్పడిన వెంటనే డయల్ 100 లేదా సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100 సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ ప్రకటనలో పేర్కొన్నారు.

Similar News