డిజిటల్ ఫ్యామిలీ కార్డు డేటా ఎంట్రీలో పొరపాట్లు జరుగవద్దు : కలెక్టర్ రాహుల్ రాజ్

డిజిటల్ ఫ్యామిలీ కార్డు డేటా ఎంట్రీ లో ఎలాంటి పొరపాట్లు జరగొద్దని

Update: 2024-10-08 11:10 GMT

దిశ, నర్సాపూర్ : డిజిటల్ ఫ్యామిలీ కార్డు డేటా ఎంట్రీ లో ఎలాంటి పొరపాట్లు జరగొద్దని సక్రమంగా నమోదయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఫ్యామిలి డిజిటల్ కార్డ్ డేటా ఎంట్రీని క్షుణ్ణంగా పరిశీలించారు. కుటుంబాల సమాచారాన్ని ఆన్లైన్ లో కలెక్టర్ నమోదు చేశారు . ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ డేటా ఎంట్రీ నమోదు విషయంలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా సక్రమంగా సమాచారాన్ని ఆన్లైన్ లో నమోదు చేయాలని సూచించారు. నర్సాపూర్ మండలంలో గొల్లపల్లి తోపాటు పట్టణంలోని ఎనిమిదో వార్డును పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి , నర్సాపూర్ తహసీల్దార్ శ్రీనివాసులు , కౌడిపల్లి తహసీల్దార్ ఆంజనేయులు , ఎంపీడీవో లు మధులత, నాగేశ్వరరావు , మున్సిపల్ మేనేజర్ మధుసూదన్ రావు, దిల్ కలెక్టర్ పాపారావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .


Similar News