బీఆర్‌ఎస్ నేతల తియ్యటి మాటలు, ముచ్చట్లు నమ్మద్దు : మైనం పల్లి

ఎన్నికలు వచ్చాయంటే.. తియ్యని ముచ్చట్లు చెప్పే బీఆర్‌ఎస్ నేతల ప్రలోభాలకు గురికావద్దని మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ అన్నారు.

Update: 2023-10-25 16:18 GMT

దిశ, మెదక్ ప్రతినిధి: ఎన్నికలు వచ్చాయంటే.. తియ్యని ముచ్చట్లు చెప్పే బీఆర్‌ఎస్ నేతల ప్రలోభాలకు గురికావద్దని మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ అన్నారు. బుధవారం మెదక్ మండలం ఖాజీ పల్లి, కొంటూర్, వెంకటాపుర్, శివ్వయిపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పదేళ్లు బీఆర్‌ఎస్ పార్టీకి ఎమ్మెల్యే గా అవకాశం ఇస్తే ఈ ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందలేదని ప్రశ్నించారు. పదేళ్ల క్రితం మైనంపల్లి ట్రస్ట్ చేసిన సేవలే గ్రామాల్లో కనిపిస్తున్నాయని అన్నారు. మంచి చేయాలని తాము వచ్చామని, కానీ సేవా చేసిన అధికార పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని అన్నారు. అధికార పార్టీ దోచుకోవడమే ధ్యేయంగా పని చేస్తుందని ఆరోపించారు. సర్ధన శివారులోని మంజీర నుంచి రెండు వేల కోట్ల ఇసుక అమ్ముకున్నారని ఆరోపించారు. పోచారం అభయారణ్యం నుంచి సిద్దిపేటకు జింకలు చేరిస్తే మన ఎమ్మెల్యే ఎందుకు అడ్డుకోలేరని ప్రశ్నించారు. జిల్లా నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు తరలిపోతున్న ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని విమర్శించారు.

మళ్ళీ అవకాశం ఇస్తే జిల్లాలో ఉన్న కార్యాలయాలు అన్ని సిద్దిపేట తరలిపోతాయని అన్నారు. ఈ ఎన్నికలు మన ఆత్మ గౌరవంకు సంబంధించినవి, ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. డబ్బుల కోసం ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, సేవ చేయాలన్న ఉద్దేశ్యంతోనే బరిలో ఉన్నట్టు చెప్పారు. పేదల కోసం కృషి చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని, ఈ సారి కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు కర్, హఫీజ్, ప్రభాకర్, నాగరాజు, పరుశురాంతో పాటు పలువురు నేతలు ఉన్నారు.

Tags:    

Similar News