శునకాల నియంత్రణకు చర్యలేవి..?15 రోజుల వ్యవధిలోనే 9 ఘటనలా

గత రెండెళ్లుగా వీధి కుక్కల వీరంగం మితిమీరిపోతుంది.

Update: 2024-07-12 05:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: గత రెండెళ్లుగా వీధి కుక్కల వీరంగం మితిమీరిపోతుంది. తరచూ చిన్నపిల్లలపై దాడి చేయడంతో కాలనీ వాసులు భయభాంత్రులకు గువుతున్నారు. పిల్లల్ని భయటికి పంపిద్దామంటే వణికిపోతున్నారు. తల్లిదండ్రులు పనిలో నిమగ్నమైన సమయంలో చిన్నపిల్లలు గేటు బయట ఆడుకోవడానికి వచ్చే క్రమంలో పిల్లలపై కుక్కలు దారుణంగా దాడి చేస్తున్నాయి. కాగా మరింత దారుణంగా సంగారెడ్డి జిల్లాలో శునకాలు పిల్లలపై రెచ్చిపోతున్నాయి. 15 రోజుల వ్యవధిలో 9 ఘటనలు జరగడం అంటే మామూలు విషయం కాదు. అందులో 6 ఏళ్ల పిల్లాడు చనిపోగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఆరుగురు గాయపడ్డారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో 20 గొర్రెలు మృత్యువాత చెందాయి. వీధి కుక్కల నియంత్రణకు ప్రతి మున్సిపాలిటీల్లో స్పెషల్ ఫండ్స్ కేటాయించారు. కానీ ఎక్కడా అలాంటి చర్యలు చేపట్టడం లేదని సంగారెడ్డి వాసులు వాపోతున్నారు. పైగా వాటి నియంత్రణకు మాత్రం అధికారులు ఫండ్స్ ఖర్చు చేస్తున్నట్టు లెక్కలు చూపిస్తున్నారంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను ఇంటి నుంచి బయటికి పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారని.. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Similar News