జాగ్రత్తలతో ఎయిడ్స్ నిర్మూలన..

లైంగిక అంశాలపై తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎయిడ్స్ వ్యాధికి కారణమైన హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ నుంచి తప్పించుకోవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చందు నాయక్ తెలిపారు.

Update: 2022-12-01 12:16 GMT

దిశ, మెదక్ ప్రతినిధి: లైంగిక అంశాలపై తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎయిడ్స్ వ్యాధికి కారణమైన హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ నుంచి తప్పించుకోవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చందు నాయక్ తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌస్ నుండి రాందాస్ చౌరస్తా వరకు ఏర్పాటు చేసిన ఎయిడ్స్ ర్యాలీని డిప్యూటీ డిఏంఅండ్ హెచ్ఓ విజయనిర్మల తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిడ్స్‌ను పూర్తిగా నిర్మూలించడం మన చేతుల్లోనే ఉందని, సురక్షితమైన లైంగిక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎయిడ్స్ బారిన పడకుండా ఉంటామన్నారు. ఎయిడ్స్‌కు ఇప్పటికి సరైన మందు లేదని, నివారణ ఒక్కటే మార్గమని అన్నారు. అనుకోకుండా హెచ్ఐవీ వైరస్ బారిన పడిన వారు అధైర్య పడకుండా డాక్టరు సలహా మేరకు తగిన మందులు వాడుతూ.. ఎప్పటిలాగే జీవించవచ్చని అన్నారు.

హెచ్ఐవీతో జీవిస్తున్న వారిలో ధైర్యం నింపడానికి మద్దతు ఇచ్చేందుకు, ఎయిడ్స్‌తో సంబంధిత వ్యాధులతో మరణించినా వారిని స్మరించుకుంటూ ప్రజలలో అవగాహన, చైతన్యం కలిగించడానికి ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 1న ఎయిడ్స్ దినోత్సవగా జరుపుకుంటున్నామని అన్నారు. ఈ సంవత్సరం ప్రపంచ ఐక్యమత్యం, భాద్యత థీమ్‌తో ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని చందు నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నవీన్, మణికంఠ, డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు గణపతి, ఏఎన్ఎం లు, వైద్య సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News