''ధరణి పోర్టల్‌ను వెంటనే రద్దు చేయాలి''
రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న ధరణి పోర్టల్‌ను వెంటనే రద్దు చేయాలని డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి డిమాండ్ చేశారు
దిశ , సంగారెడ్డి: రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న ధరణి పోర్టల్‌ను వెంటనే రద్దు చేయాలని డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి అధ్యక్షతన సంగారెడ్డి ఆర్.డి.ఓ.కు ధరణి పోర్టల్ రద్దు చేయాలని మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత ధరణి పోర్టల్ ఏర్పాటు చేసి 2022 వరకు దాదాపు 20 లక్షల కుటుంబాల పట్టా భూములను నిషేధిత భూములుగా ప్రకటించారని ఆరోపించారు. అదేవిధంగా కౌలు రైతులకు సమాన హక్కు ఇవ్వాలని చెప్పి అటవి ప్రాంతంలో ఉన్న ఆదివాసులకు కాంగ్రెస్ పార్టీ హయాంలో వారికి సాగు చేసుకోవడానికి చట్టం రూపొందిస్తే టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రులు అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసుల భూములను కబ్జా చేసి వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నారని విమర్శించారు. వెంటనే ధరణి పోర్టల్ను రద్దు చేయాలని, పోడు భూములను రైతులకు అప్పగించాలని, ఆదివాసుల భూములను వారికే అప్పగించాలని డిమాండ్ చేశారు.
READ MORE