రుణ లక్ష్యాలను చేరుకోవాలి: జిల్లా కలెక్టర్ శరత్

బ్యాంకర్లు రుణాల లక్ష్యాన్ని చేరుకోవాలని, వివిధ పథకాల కింద ఎంపికైన లబ్ధిదారులకు రుణాలను త్వరగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డా.శరత్ బ్యాంకర్లకు సూచించారు.

Update: 2023-03-08 12:26 GMT

దిశ, సంగారెడ్డి:బ్యాంకర్లు రుణాల లక్ష్యాన్ని చేరుకోవాలని, వివిధ పథకాల కింద ఎంపికైన లబ్ధిదారులకు రుణాలను త్వరగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డా.శరత్ బ్యాంకర్లకు సూచించారు.బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా సమన్వయ, సంప్రదింపుల కమిటీ (డీసీసీ, డీఎల్ఆర్సీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా వివిధ పథకాలలో అందిస్తున్న యూనిట్లను వేగవంతంగా గ్రౌండింగ్ చేయాలన్నారు.

15 రోజుల్లోగా రుణ లక్ష్యాలను పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, బ్యాంకర్లకు ఆదేశించారు.ఈ ఆర్థిక సంవత్సరం పంట రుణాల లక్ష్యం రూ.2,450 కోట్లు కాగా డిసెంబర్ 22 నాటికి రూ.2,070 కోట్ల రుణాలు మంజూరి చేశారని తెలిపారు. ఎంఎస్ఎంఈ రుణ లక్ష్యం రూ.950 కోట్లకు గాను లక్ష్యాన్ని మించి రూ.1104.87 కోట్లు ఇచ్చారని, డీఆర్డీఏ ద్వారా స్వయం సహాయక సంఘాల కు రూ.840.15 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్దేశించగా ఇప్పటి వరకు 836.38 కోట్ల రుణాలు అందించారని వెల్లడించారు.

మెప్మా రుణ లక్ష్యం రూ.98.34 కోట్లు కాగా, ఇప్పటికే రుణ లక్ష్యాన్ని అధిగమించి 100.47 కోట్ల రుణాలను అందించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ గోపాల్ రెడ్డి, ఆర్బీఐ ఏజీఎం ఆలీబాబా, నాబార్డ్ ఏజీఎం కృష్ణ తేజ, వివిధ శాఖల జిల్లా అధికారులు, బ్యాంకర్లు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News