గుండారం ఫాంహౌజ్ ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తల యత్నం
మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీరుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫైర్

దిశ, బెజ్జంకి : మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీరుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పై అసత్య ఆరోపణలకు నిరసనగా బుధవారం బెజ్జంకి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం గుండారంలోని రసమయి బాలకిషన్ ఫాం హౌజ్ ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆరు మండలాల కాంగ్రెస్ మండలాధ్యలు నాయకులు ముక్కిస రత్నాకర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ చైర్మన్ పులి కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, రమణారెడ్డి, రాఘవరెడ్డి, ఉపేందర్ రెడ్డి, బసవయ్య, రవీంద్ర చారిలు మాట్లాడుతూ... ఎల్ వోసీ లు సీఎం రిలీఫ్ ఫండ్ తదితర విషయాల్లో రసమయి బాలకిషన్ చేసిన ఆరోపణలు ఆసత్యమైనవని అన్నారు. మాజీ ఎమ్మెల్యే రసమయి చేసిన ఆరోపణలపై చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు. బెజ్జంకి చౌరస్తాలో చర్చకు రావాలని మాజీ ఎమ్మెల్యే కు రసమయి బాలకిషన్ సూచించిన రాకుండా తోక ముడిచాడని ఎద్దెవ. చేశారు. రసమయి ఫాం హౌజ్ కు మళ్లించిన కాలువను పూడ్చి వేసి రైతుల పొలాలకు మళ్లిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల కాంగ్రెస్ నాయకులు అనుబంధం కమిటీల నాయకులు తదితరులు పాల్గొన్నారు..