రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్

కాంగ్రెస్ 18 నెలల పాలనలో సాగునీరు, తాగునీరు ఇవ్వకుండా అటు రైతులను,

Update: 2025-03-22 09:20 GMT
రైతుల పొట్ట కొడుతున్న  కాంగ్రెస్ ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
  • whatsapp icon

దిశ,ములుగు : కాంగ్రెస్ 18 నెలల పాలనలో సాగునీరు, తాగునీరు ఇవ్వకుండా అటు రైతులను, ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. గోదావరి కన్నీటి గోస పేరుతో ఆరు రోజులుగా ఆయన చేస్తున్న మహా పాదయాత్ర సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం లోని గణేష్ పల్లి నరసన్నపేట ఎర్రవల్లి మీదుగా కేసీఆర్ ఫామ్ వ్యవసాయ క్షేత్రం చేరుకుంది. ఈ సందర్భంగా వరకు మండలంలోని గణేష్ పల్లి లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు అమలుకు సాధ్యంకాని హామీలను ఇచ్చి గతం బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసి అబద్ధపు పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శించారు. గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులు కుంగాయని అబద్ధం ప్రచారం చేసినప్పుడు రైతులకు, ప్రజలకు సాగు తాగునీరు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు.

రాష్ట్రం సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రం సాగునీటికి గోసా పెడుతున్న ప్రజలు సమస్యలు తెలిపేందుకే పాదయాత్ర కొనసాగిస్తున్నానని తెలిపారు. గోదావరి కన్నీటి గోస పాదయాత్రలో భాగంగా వంటేరు ప్రతాప్ రెడ్డి వారితో కలిసి నడిచారు. అనంతరం వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాకముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అనేక బూటకపు అబద్ధాలు అసత్యపు ప్రచారాలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మాయమాటలు చెప్పి గద్దినెక్కారని అన్నారు. ఇప్పటికే 18 నెలలు గడుస్తున్న ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి హామీలు అమలు చేయడం లేదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని ఎలాంటి పథకాలను కూడా ప్రజల ముందుకు తీసుకురాకపోవడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం సాగునీరు కోసం లక్షల కళ్ళతో ఎదురుచూస్తున్నారని అన్నారు. గోదావరి ప్రాజెక్టుల ను ఎండబెట్టి రైతులు కడుపు కొట్టడమే కాక వారి బాధలను పై కనీసం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మర్కుక్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, మాజీ ఎంపీపీ పాండు గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి, మండల బీసీ సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య, ఎంపీటీసీలు కృష్ణ యాదవ్, నరేందర్, సంతోష్ రెడ్డి, సాయిని మహేష్, బాపు రెడ్డి, సుధాకర్ రెడ్డి, పత్తి బాబు, సంతోష్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News