భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక పటాన్ చెరు : ఎమ్మెల్యే

మినీ ఇండియా గా పేరొందిన పటాన్ చెరు నియోజకవర్గం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తోందని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.

Update: 2025-03-24 15:06 GMT

దిశ,పటాన్ చెరు : మినీ ఇండియా గా పేరొందిన పటాన్ చెరు నియోజకవర్గం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తోందని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గ స్థాయి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ తాజా, మాజీ ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఎమ్మెల్యే గూడెం మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ముస్లింలకు తగు ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. ప్రముఖ వక్త, బ్రదర్ షఫీ పరమత సహనంపై ప్రత్యేకంగా బోధనలు చేశారు. అన్ని మతాల సారాంశం ఒక్కటేనని.. కష్టనష్టాల్లో ఒకరికొకరు అండగా నిలవాలని కోరారు. ప్రపంచంలోనే భారతదేశం విభిన్నమైనదని తెలిపారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గాలి అనిల్ కుమార్, నియోజకవర్గ తాజా మాజీ ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, ముస్లింలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Similar News