అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ : నర్సాపూర్ రోడ్డు షో లో కేసీఆర్

ప్రజలకు అబద్ధాలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు.

Update: 2024-05-08 15:57 GMT

దిశ, నర్సాపూర్ : ప్రజలకు అబద్ధాలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. బుధవారం డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో మెదక్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఉచిత బస్సు తప్ప ఏ హామీ పూర్తిగా నెరవేరలేదని అన్నారు. తలా తోక లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ మెడలు వంచి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు బీఆర్ఎస్ కృషి చేస్తుందని తెలిపారు. రెండు లక్షల రుణమాఫీ, రైతుబంధు, 500 బోనస్,

    మహిళలకు 2500, నాలుగు వేల పెన్షన్ ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వంలో రూపాయి విలువ 84 పైసలకు పడిపోయిందని ఆరోపించారు. పెట్టుబడులు పోయి పరిశ్రమలు మూతపడి కార్మికులు రోడ్డున పడ్డారని విమర్శించారు. భవిష్యత్తు మనదేనని ఆలోచించి ఓటెయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మెదక్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్, సీనియర్ నాయకులు గోపి సత్యం గౌడ్ దొంతి, సంతోష్ రెడ్డి తోపాటు నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

Tags:    

Similar News