స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన చేగుంట కుర్రాడు
ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాల్లో చేగుంట మండల కేంద్రానికి చెందిన విద్యార్థి రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించాడు.
హోటల్ నడుపుకుంటూ కొడుకుని చదివించిన తల్లి
దిశ చేగుంట : ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాల్లో చేగుంట మండల కేంద్రానికి చెందిన విద్యార్థి రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించాడు. విద్యార్థి తల్లి హోటల్ నడుపుకుంటూ జీవనం సాగించడమే కాకుండా కొడుకును చదివిస్తూ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించేలా కృషి చేయగలిగింది. మండల కేంద్రానికి చెందిన ఎర్రబాబులు ఆదిభట్లలోని శ్రీ చైతన్య ఐఐటీ అకాడమీలో మొదటి సంవత్సరం చేరి రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించాడు.
ఎంపీసీ గ్రూపులో 467 మార్కులు సాధించి మొదటి ర్యాంకు సాధించడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎర్ర సుమిత్ర, నరసింహులు చేగుంట మండల కార్యాలయాల ఎదుట హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. నిరుపేద దళిత కుటుంబం నుంచి వచ్చిన ఎర్రబాబు రాష్ట్ర స్థాయి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో మొదటి ర్యాంకు సాధించడం పట్ల గ్రామస్థులు అభినందనలు తెలియజేశారు. ఎంపీసీ గ్రూప్లో 470 మార్కుల గాను 467 మార్పులు సాధించిన ఎర్రబాబులు ద్వితీయ సంవత్సరంలో కూడా రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.