సమాజంలో మార్పు మన నుంచే మొదలవ్వాలి

నేటి సమాజంలో మహిళలపై అణిచివేత వివక్షత ఎక్కువవుతోందని, వాటి పరిష్కారానికి మార్పు మన నుంచే మొదలవ్వాలని మానవ హక్కుల కమిషన్ చైర్మైన్ జస్టిస్ జి.చంద్రయ్య సూచించారు.

Update: 2023-03-26 12:22 GMT

మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య

దిశ, సంగారెడ్డి: నేటి సమాజంలో మహిళలపై అణిచివేత వివక్షత ఎక్కువవుతోందని, వాటి పరిష్కారానికి మార్పు మన నుంచే మొదలవ్వాలని మానవ హక్కుల కమిషన్ చైర్మైన్ జస్టిస్ జి.చంద్రయ్య సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన గురుకుల న్యాయ కళాశాలలో న్యాయ విద్యార్థులకు "మహిళలపై నేరాలు మరియు నేర న్యాయ వ్యవస్థ - సవాళ్లు, పరిష్కార మార్గాలు" అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరైన జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ ప్రాథమిక హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహనా పెంచుకోవాలని సూచించారు.

ఆత్మగౌరవంతో జీవించడానికి కృషి చేయాలని, రాజ్యాంగబద్ధంగా ప్రతి పౌరునికి సమాన హక్కులు ఉంటాయన్నారు. నేటి సమాజంలో స్త్రీని ద్వితీయ శ్రేణి పౌరురాలిగా చూడడం అన్యాయమని వాపోయారు. ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి ఎస్.శశిధర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో నేరానికి గురికాక తప్పదన్నారు. స్త్రీని ఆది పరాశక్తి అని నామమాత్రానికి అంటాం కానీ, కుటుంబంలో కూడా వివక్షకు గురి అవుతోందన్నారు. చట్టం దిశగా వచ్చిన మార్పులను అర్థం చేసుకోవాలని సూచించారు. నేరాలు జరిగినప్పుడు సమాజంలో వచ్చిన మార్పుల వల్లే స్త్రీలకు రక్షణ, న్యాయ సహాయం అందించడంలో భాగంగా జిల్లా కేంద్రాల్లో భరోసా, సఖి కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

వాటిని ఉపయోగించుకొని భాధిత స్త్రీలు న్యాయ సహాయం పొందవచ్చని వివరించారు. ఉస్మానియా యూనివర్సిటీ న్యాయ శాఖ డీస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్, గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీ డిప్యూటీ సెక్రటరీ, డిప్యూటీ కలెక్టర్ ఎస్.జగదీష్ రెడ్డి, న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ డా.బి.కృష్ణ నాయక్, న్యాయ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రూత్ కమలిని, న్యాయ కళాశాల అధ్యాపకులు పాటు ఇతర కళాశాల అధ్యాపకులు, న్యాయ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:    

Similar News