ఆనందోత్సాహాలతో రంజాన్ ను జరుపుకోవాలి: టీ.ఎస్.హెచ్.డీ.సీ చైర్మన్ చింతా ప్రభాకర్
ఆనందోత్సాహాలతో రంజాన్ ను జరుపుకోవాలని తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ అన్నారు.
దిశ, సంగారెడ్డి: ఆనందోత్సాహాలతో రంజాన్ ను జరుపుకోవాలని తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ఇమామ్ లు, మౌజమ్ లకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఇమాం, మౌజమ్ లకు నిత్యావసర సరుకులు ఐదుగురికి రూ.2,800 విలువ గల సరుకులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా ఇమామ్ లు, మౌజమ్ లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. పవిత్ర రంజాన్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. గత ఆరేళ్లుగా అమాన్ కన్స్ట్రక్షన్ సహకారంతో నిరు పేద ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో ఆఫ్టర్ అమిత్, మసూద్, ఆర్.వెంకటేశ్వర్లు, ముష్టి ఫయాజ్, మౌలానా హాజీస్, ఇలియాస్, మౌలానా ఆదిల్, జాకీర్ హమీద్, షకీల్, ముక్తార్, యూనిస్, నర్సింహులు, శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, విష్ణు, శ్రావణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.