Siddipet: మంత్రి హరీశ్‌రావు భావోద్వేగం

Update: 2023-04-09 10:21 GMT

దిశ, వెబ్ డెస్క్: టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా అవతరించిన తర్వాత గ్రౌండ్ లెవల్‌లో పార్టీ బలోపేతం కోసం పూర్తి స్థాయిలో కార్యక్రమాలు చేపడుతోంది. తెలంగాణలో సాధారణ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో పార్టీ నేతలు, కార్యకర్తలను ఆ పార్టీ అధిష్టానం సమాయత్తం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తోంది. ఈ సమ్మేళనాలను విజయవంతం చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలను రంగంలోకి దింపింది. ప్రతి నియోజకవర్గంలోనూ ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నారు.

ఈ మేరకు మంత్రి హరీశ్ రావు సైతం సిద్దిపేట నియోజకవర్గం రాఘవపూర్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ఆయన ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ నేతలు, కార్యకర్తల ప్రేమ, ఆప్యాయత చూస్తుంటే తనకు కళ్లలో నీరు వస్తున్నాయని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. పదవులు ఇవాళ ఉండొచ్చని, రేపు పోవచ్చని, కానీ ప్రేమ, ఆప్యాయత ముందు ఏవీ పనికి రావన్నారు. కార్యకర్తలు చూపుతున్న ప్రేమ ముందు తమ చర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కువేనని ఆవేదన వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News