కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ నాయకులు

బీఆర్‌ఎస్‌ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరికలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.

Update: 2023-11-21 15:31 GMT

దిశ, అందోల్‌: బీఆర్‌ఎస్‌ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరికలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో పార్టీని వీడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో బీఆర్‌ఎస్‌ పార్టీకి తలనోప్పిగా మారింది. పార్టీ మారుతున్న వారి వివరాలు ముందుగా తెలిసినా వారిని అదుపుచేయడంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకత్వం విఫలం కావడంతో చేరికల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా అందోలు మండల పరిధిలోని ఏర్రారం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మంగళవారం దామోదర్‌ రాజనర్సింహ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ముదిరాజ్‌ సంఘం మాజీ అధ్యక్షుడు మల్లేశం, ఉప సర్పంచ్‌ స్వాతి శేఖర్‌రెడ్డి, అత్మకమిటీ డైరెక్టర్‌ శంకర్, నీటి సంఘం మాజీ చైర్మన్‌ హన్మంత్‌రెడ్డితో పాటు తదితరులు కాంగ్రెస్‌లో చేరారు. వీరికి దామోదర్‌ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా దామోదర్‌ మాట్లాడుతూ... కాంగ్రెస్‌ పార్టీ గెలుపుకు కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేస్తూ, మన ప్రాంతాన్ని మరింతగా అభివృద్ది చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు శ్రీనివాస్‌ గౌడ్, మాజీ ఎంపీటీసీ రాజీరెడ్డితో పాటు తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News