ప్రజల మధ్యలో ఉంటూ పార్టీకి మంచి పేరు తీసుకురండి.. మంత్రి సీతక్క

ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకురావాలని, కాంగ్రెస్ నాయకులను గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కోరారు.

Update: 2024-09-30 09:53 GMT

దిశ, చిన్నకోడూరు : ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకురావాలని, కాంగ్రెస్ నాయకులను గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కోరారు. సోమవారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు బయలుదేరారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిక్కుడు అనిల్ కుమార్, కాంగ్రెస్ నాయకుడు అజ్జు యాదవ్ లు సీతక్కను చర్లంకి రెడ్డి పల్లె స్టేజ్ వద్ద కాన్వాయ్ ని ఆపి గ్రామ సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మంత్రి సమస్యలను పరిష్కరిస్తానని సానుకూలంగా స్పందించారు. అనంతరం శాలువాతో మంత్రి సీతక్కను సన్మానించారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, బైరోజి రమేష్, చింతల రాజు తదితరులు పాల్గొన్నారు.


Similar News