బీజేపీది మత విద్వేషపు రాజకీయం: ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
బీజేపీది మత విద్వేషపు రాజకీయమని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తానని ఇటీవల కేంద్ర మంత్రి అమిషా చేసిన ప్రకటన మతవిద్వేషాలను రెచ్చగొట్టడమేనని వారు అన్నారు.
దిశ, ఆందోల్: బీజేపీది మత విద్వేషపు రాజకీయమని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తానని ఇటీవల కేంద్ర మంత్రి అమిషా చేసిన ప్రకటన మతవిద్వేషాలను రెచ్చగొట్టడమేనని వారు అన్నారు. మంగళవారం జోగిపేటలోని శ్రీ రామ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ఆందోల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధుల ప్లినరీ సమావేశం నిర్వహించారు.
పట్టణంలోని జోగినాథ్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేసి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా సమావేశానికి బయలుదేరి వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు.
కేంద్ర ప్రభుత్వ వైఖరిని మనందరం తిప్పి కొట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన 18 అంశాలను తీర్మానం చేసి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ జైపాల్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాహుల్ కిరణ్, భిక్షపతి, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్మన్ డేవిడ్, వరము చైర్మన్ వీరారెడ్డి, ఎత్తిపోతల పథకం చైర్మన్ లింగగౌడ్, ముది రాజ్ సంఘం అధ్యక్షుడు పీ.శివశేఖర్, ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.