కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్..

పటాన్ చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది

Update: 2023-11-03 15:45 GMT

దిశ, పటాన్ చెరు: పటాన్ చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత మాజీ కార్పొరేటర్ సఫాన్ దేవ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎన్నికల సమయంలో సఫాన్ దేవ్ పార్టీ మారడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తో కలిసి సఫాన్ దేవ్ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన సఫాన్ దేవ్ ఉమ్మడి రాష్ట్రంలో పటాన్ చెరు డివిజన్ కార్పొరేటర్ గా పని చేయడంతో పాటు రెండుసార్లు టీడీపీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు.

2014 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిన సఫాన్ దేవ్ పార్టీలో తనకు ప్రాధాన్యం దక్కట్లేదన్న కారణంతో 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్ లో కొనసాగుతున్న ఆయన కాసాని జ్ఞానేశ్వర్ ఒత్తిడి మేరకు గులాబీ గూటికి చేరినట్లు తెలుస్తుంది. ముదిరాజ్ సామాజిక వర్గం బీఆర్ఎస్ పార్టీ పై గుర్రుగా ఉన్న తరుణంలో అదే సామాజిక వర్గానికి చెందిన సఫాన్ దేవ్ బీఆర్‌ఎస్ పార్టీ లో చేరడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పటాన్ చెరు నియోజకవర్గం నుంచి నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం లభిస్తుందన్న ప్రచారం సాగుతున్న తరుణంలో సఫాన్ దేవ్ పార్టీని విడడం పట్ల ముదిరాజ్ సామాజిక వర్గ ప్రజలు ఏ విధంగా స్పందిస్తారన్న విషయం పై జోరుగా చర్చ జరుగుతుంది.

Tags:    

Similar News