పొద్దు పొద్దున్నే ఫుల్లుగా తాగి నడి రోడ్డు మీదే... (వీడియో)

బెల్టు షాపుల పుణ్యమా అంటూ గ్రామీణ ప్రాంతంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది...belt shops in Vaddannaguda tanda of kandi

Update: 2022-11-18 06:20 GMT

దిశ, కంది: బెల్టు షాపుల పుణ్యమా అంటూ గ్రామీణ ప్రాంతంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది యువకులు మత్తులో చిత్తయిపోతున్నారు. కంది మండలం వడ్డన్నగూడ తండాలో ఎక్కడపడితే అక్కడ జోరుగా బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయి. ఇదే విషయమై గత కొద్ది నెలలుగా స్థానిక గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై స్థానిక సర్పంచ్ తోపాటు గ్రామీణ ప్రాంత మహిళలు అందరూ కలిసి ఎక్సైజ్, ఇతర శాఖల అధికారులకు వినతి పత్రాలు అందించి తమ గ్రామంలో బిల్ట్ షాపులు తొలగించాలని కోరారు. అయినా కూడా ఎక్సైజ్ శాఖ అధికారుల నుంచి సరైన స్పందన రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఓ యువకుడు ఫుల్లుగా మద్యం సేవించి రోడ్డుపై పడిపోయిన దృశ్యాలను స్థానికులు చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. బెల్ట్ షాపులలో 24 గంటల పాటు మద్యం దొరుకుతుండడంతో గ్రామంలో ఉన్న యువకులు, పెద్దలు ఇలా ఎప్పుడు పడితే మద్యం సేవించి రోడ్డుపై పడుతున్నారని, రోడ్డు ప్రమాదాల బారిన కూడా పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ గ్రామంలో బెల్ట్ షాపులు లేకుండా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


Similar News