తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని
దిశ, జిన్నారం: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మండలం లోని బొల్లారం మున్సిపల్ పరిధిలో గల 3వ వార్డులో రూ.77 లక్షల నిధులతో నిర్మించిన బతుకమ్మ ఘాట్, హై మాస్ట్ లైట్లను బుధవారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఘాట్ ఆవరణలో జమ్మి చెట్టు మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే పువ్వులను పూజించే పండుగ బతుకమ్మ పండుగ అన్నారు.
బొల్లారం మున్సిపల్ ప్రజల కోసం అన్ని వసతులతో బతుకమ్మ ఘాట్ నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. మహిళలు బతుకమ్మ ఉత్సవాలను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బొల్లారం మున్సిపల్ చైర్ పర్సన్ రోజా బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, హనుమంత్ రెడ్డి, వరప్రసాద్ రెడ్డి, జైపాల్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.