క్రమశిక్షణకు ప్రతిరూపాలు అంగన్వాడీలు.. కలెక్టర్ రాహుల్ రాజ్

నాణ్యమైన పోషకాహారం, ఉత్తమ విద్యా బోధన క్రమశిక్షణకు ప్రతిరూపాలుగా మెదక్ జిల్లా అంగన్వాడి సెంటర్స్, ప్రభుత్వ పాఠశాలలు ఆదర్శంగా నిలుస్తున్నాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Update: 2024-09-18 14:43 GMT

దిశ, పాపన్నపేట : నాణ్యమైన పోషకాహారం, ఉత్తమ విద్యా బోధన క్రమశిక్షణకు ప్రతిరూపాలుగా మెదక్ జిల్లా అంగన్వాడి సెంటర్స్, ప్రభుత్వ పాఠశాలలు ఆదర్శంగా నిలుస్తున్నాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా పాపన్నపేట మండలం ఎనికేపల్లి గ్రామంలో విస్తృతంగా పర్యటించి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి సెంటర్ ను పరిశీలించిన అనంతరం గ్రామ పరిసరాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్ లో ఉత్తమ విద్యాబోధన అందుతుందని అంగన్వాడి పిల్లల సామర్ధ్యాలు స్వయంగా పరిశీలిస్తారని, ఉత్తమ విద్యాబోధన అందించిన అంగన్వాడి టీచర్ ను, ఆయాను సన్మానించి అభినందించారు. అంగ‌న్‌వాడీలో చ‌దువుకునే పిల్ల‌ల‌కు అత్యుత్త‌మ బోధ‌నతో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తూ ప్రభుత్వ పాఠశాలలు విద్యా ప్రమాణాలు మెరుగుకు కృషి చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం గ్రామంలో పర్యటిస్తూ గ్రామం స్వచ్ఛతకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతని ఆయన పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. వ్యక్తిగత, శారీరక పరిసరాల పరిశుభ్రత పై ప్రజలు దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Similar News