పద్మశాలీయులందరూ ఐక్యంగా ఉండాలి : టీ.ఎస్.హెచ్.డీ.సీ చైర్మన్ చింతా ప్రభాకర్

పద్మశాలి కులస్థులందరూ అందరూ ఐక్యంగా ఉండాలని టీ.ఎస్.హెచ్.డీ.సీ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు.

Update: 2023-05-16 16:10 GMT

దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ : పద్మశాలి కులస్థులందరూ అందరూ ఐక్యంగా ఉండాలని టీ.ఎస్.హెచ్.డీ.సీ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. మంగళవారం వై.ఎం.ఆర్ గార్డెన్స్ లో సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో పద్మశాలి సంఘం ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీ.ఎస్.హెచ్.డీ.సీ చైర్మన్ చింతా ప్రభాకర్, పద్మశాలి సంఘం సమన్వయ కమిటీ ఛైర్మెన్ రామ శ్రీనివాస్ హాజరయ్యారు. అదేవిధంగా జిల్లా, పట్టణ, మండల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

సంగారెడ్డి జిల్లాలో జోరుగా సాగుతున్న తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల గురించి సంబంధించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విచ్చేసిన టీ.ఎస్.హెచ్.డీ.సీ చైర్మన్ చింతా ప్రభాకర్ గారికి, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం సమన్వయ కమిటీ చైర్మన్ రామ శ్రీనివాస్ లను పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు గుండు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జిల్లా పక్షాన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు గందెమల్లె రాజుగారు, సంగారెడ్డి పట్టణాధ్యక్షులు తోటి భగవాన్ దాస్, కార్యదర్శి విశ్వనాథం, కోశాధికారి గుజ్జరి రుక్కయ్య, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు శ్రీరామ్ వెంకట్, కార్యదర్శి దండే నాగరాజు, కోశాధికారి భోగ లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు కొలిపాక విక్రమాదిత్య, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కోస్కే కృష్ణ, మహిళా అధ్యక్షురాలు గుజ్జరి శారద, పట్టణ మహిళా అధ్యక్షురాలు పాలడుగు భారతి, కార్యదర్శి సుప్పాల సంగీత, పట్టణ గౌరవాధ్యక్షులు డాక్టర్ మార్కండేయ, యువజన విభాగం గౌరవాధ్యక్షుడు కోట సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బూర మల్లేశం, వేముల రమేష్, రాష్ట్ర కార్యవర్గంలోని సభ్యులు, సదాశివపేట పట్టణ అధ్యక్షుడు అంబటి విశ్వనాథం, జహీరాబాద్ పట్టణాధ్యక్షుడు గడ్డం జనార్దన్, సంగారెడ్డి పట్టణ ఉపాధ్యక్షుడు చేవెళ్ల జ్ఞానేశ్వర్, చేవెళ్ల మహదేవ్, పాలడుగు పాండు, బిట్ల కృష్ణమూర్తి, మునిపల్లి వీరన్న, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News