'ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి'

ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను పరిశీలించి పెండింగులో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రమేష్ అధికారులను ఆదేశించారు.

Update: 2022-11-28 13:09 GMT

దిశ, మెదక్ ప్రతినిధి: ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను పరిశీలించి పెండింగులో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రమేష్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా నలుమూలల నుండి వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కార నిమిత్తం సంబంధిత శాఖాధికారులకు సిఫారసు చేస్తూ.. అధికారులు సమస్యల పరిష్కారంలో అధికారులు నిబద్ధతతో పని చేయాలని, సమస్యలు పరిష్కారం కానివాటికి గల కారణాలను అర్జీదారునికి తెలపాలని హితవు చెప్పారు. ప్రజావాణిలో 63 దరఖాస్తులు రాగా అందులో ప్రధానంగా వాడు భూములకు సంబంధించి (15) దరఖాస్తులతో పాటు ధరణిలో మార్పులు, భూమి సర్వే వంటి పలు భూ సమస్యలు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఆసరా పింఛన్ల తదితర అంశాలకు సంబంధించి ఫిర్యాదులున్నాయి.

ఫిర్యాదులు ఇలా..

సర్వే నెంబర్ 491/ఋ లో ఉన్న 33 గుంటల భూమి వేరే వ్యక్తుల పై పెద్దదని సరి చేయవలసిందిగా రామాయంపేట మండలం సుతారిపల్లి వాసి ఆకుల లత కోరారు. భూ ప్రక్షాళనలో నా భూమి ఇతరులపై మార్పిడి అయినదని, తిరిగి నా పేరున మార్పు చేయవలసినదిగా నిజాం పేట్ వాసి ఒజ్జ బూదవ్వ విజ్ఞప్తి చేశారు. సింగరాయి గుట్ట లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయాలకు దూప, దీప నైవేద్యములకై సర్వేనెంబర్ 607 లో ఉచితంగా మేము ఇచ్చిన 2 ఎకరాల 38 గుంతల భూమిని అర్చకులు అక్రమంగా తమ పేరుతో పట్టా చేసుకున్నారని, అట్టి భూమిని రక్షించ వలసినదిగా చేగుంట మండలం బోనాల కొండాపూర్ గ్రామ వాసి మెతుకు పల్లి వెంకట రాజిరెడ్డి అభ్యర్థించారు. 30 సంవత్సరాల నుండి సర్వేనెంబర్ 112 లో ఖాస్తులో ఉంది సాగు చేసుకుంటున్న 3 ఎకరాల భూమికి పట్టా ఇప్పించవలసిందిగా పాపన్నపేట మండలం అబ్లాపూర్ నివాసి ముమ్మని సుజాత అభ్యర్థించగా పరిశీలించవలసిందిగా డి.టి.డబ్ల్యు.ఓ. కు సూచించారు.

సర్వే నెంబర్ 10 లో నా పొలమునకు రెండు వైపులా మురుగు నీరు ప్రవహిస్తున్నదని, డ్రైనేజి నిర్మించవలసినదిగా నార్సింగి మండలం శంకాపురం వాసి సత్యసాయి రెడ్డి విజ్ఞప్తి చేయగా తగు చర్య తీసుకోవలసిందిగా డి.పి .ఓ. కు. సూచించారు. అదేవిధంగా నా అనుమతి లేకుండా సర్వే నెంబర్ 343 లోని నా సొంత భూమిలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి గుంత తీశారని, అట్టి పనులను నిలుపుదల చేయవలసినదిగా చిలిపి చెడు మండలం జగ్గంపేట వాసి తుపాకుల యాదమ్మ ఫిర్యాదు చేయగా తగు చర్య తీసుకోవలసిందిగా రమేష్ సూచించారు.

గత 40 సంవత్సరాల నుండి పాపన్నపేట లో నివసిస్తున్న మాకు ఇల్లు లేదని, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయవలసినదిగా చికిరి యశోద విజ్ఞప్తి చేశారు. నాకు ఉన్న 2 .18 ఎకరాల పొలం పై జీవిస్తున్నానని, బోరుబావి లేదని మంజూరు చేయవలసినదిగా కౌడిపల్లి మండలం లింగంపల్లి తాండ వాసి కేతావత్ మింగ్య అభ్యర్థించగా తగు చర్య తీసుకోవలసిందిగా డి.టి.డబ్ల్యు.ఓ. కు సూచించారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్, డి.ఎస్.ఓ. శ్రీనివాస్, ఎడి మైన్స్ జయరాజ్, పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ కృష్ణ మూర్తి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ రజాక్, నీటిపారుదల ఈ ఈ శ్రీనివాస్ రావు, కలెక్టరేట్ ఏ.ఓ. యూనుస్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News