క్రికెట్ ఆడుతుండగా యువకుడికి హార్ట్ స్ట్రోక్
క్రికెట్ ఆడుతుండగా ఓ యువకుడికి హార్ట్ స్ట్రోక్ కు గురై ప్రాణాలు విచిడిన ఘటన హుస్నాబాద్ పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది.
దిశ, హుస్నాబాద్: క్రికెట్ ఆడుతుండగా ఓ యువకుడికి హార్ట్ స్ట్రోక్ కు గురై ప్రాణాలు విచిడిన ఘటన హుస్నాబాద్ పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని సబ్ స్టేషన్ పక్కన గల మైదానంలో కే.ఎం.ఆర్ క్రికెట్ టోర్నమెంట్ కొనసాగుతోందిజ. ఈ క్రమంలో క్రికెట్ ఆడుతుండగా బౌలింగ్ వేస్తూ శనిగరం ఆంజనేయులు (35) అనే యువకుడు ఒక్కసారిగా హార్ట్ స్ట్రోక్ గురై మైదానంలోనే కుప్పకూలిపోయాడు.
దీంతో తోటి యువకులు సీపీఆర్ చేసి హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స చేసినా ప్రయోజనం లేకపోవడంతో వైద్యులు హార్ట్ ఎటాక్ తో మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడు కరీంనగర్ జిల్లా సుందరగిరి గ్రామానికి చెందిన ఆంజనేయులుకు భార్య ధనలక్ష్మి, తల్లి మల్లవ్వ ఉన్నారు. నాగరాజు తండ్రి చనిపోవడంతో అతనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవడంతో భార్య, శోకసంద్రంలో మునిగిపోయారు.