పాపం చిన్నారి.. క్షణిక ఆవేశమా లేక చేసిన తప్పును కప్పిపుచ్చుకునే యత్నమా?
క్షణికావేశంలో చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నమో లేకే మరేదైన కారణమో తెలియదు కానీ, అంతరించిపోతున్న మానవత విలువలకు, మానవ సంబంధాలకు.. నిదర్శనంగా నిలుస్తున్న
దిశ, కొల్చారం: క్షణికావేశంలో చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నమో లేకే మరేదైన కారణమో తెలియదు కానీ, అంతరించిపోతున్న మానవత విలువలకు, మానవ సంబంధాలకు.. నిదర్శనంగా నిలుస్తున్న సంఘటన మంగళవారం ఉదయం కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి చౌరస్తా సమీపంలోని కెనాల్ కాలువలో వెలుగు చూసింది.
మెదక్ రూరల్ సీఐ విజయ్ గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. పోతంశెట్టిపల్లి చౌరస్తా సమీపంలోని ఎం ఎన్ కెనాల్ కాలువలో సుమారు మూడు నెలల వయసున్న బాలుని మృతదేహం మంగళవారం ఉదయం లభించింది. బాలుని ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకపోగా మెడకు బట్టతో చుట్టి ఉరివేసి ఆ బట్టను నీటి ప్రవాహంలో మృతదేహం కొట్టుకపోకుండా ఉండేలా కాలువలో బండరాయికి కట్టారు. చనిపోయిన మృతదేహాన్ని కాలువలో పడేశారా.. లేక బతికున్న బాలున్నే కర్కషంగా ఉరివేసి చంపి కాలువలో వేశారా తెలియదు, మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపారు. ఇక ఈ సంఘటన గ్రామస్థులను, హైదరాబాద్ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులను కంటతడి పెట్టిస్తుంది.బాలుని మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. సంఘటన స్థలాన్ని మెదక్ రూరల్ సీఐ విజయ్ కొల్చారం ఎస్ఐ సార శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.