108 వాహనంలోనే ప్రసవం.. తల్లీ బిడ్డ క్షేమం

అంబులెన్స్ లో గిరిజన గర్భిణీ పండంటి బిడ్డకి జన్మనిచ్చిన ఘటన గురువారం ఔరంగాబాద్ తండా శివారులో చోటు చేసుకుంది.

Update: 2023-02-23 15:01 GMT

దిశ, మెదక్ ప్రతినిధి: అంబులెన్స్ లో గిరిజన గర్భిణీ పండంటి బిడ్డకి జన్మనిచ్చిన ఘటన గురువారం ఔరంగాబాద్ తండా శివారులో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం ఔరాంగబాద్ సమీపంలో కొచ్చెరువు తండాకు చెందిన మాలోవత్ విజయ అనే గర్భిణీకి నెలలు నిండాయి. ఈ క్రమంలో గురువారం ఉదయం పురుటినొప్పులు వచ్చాయి. అందుబాటులో ఎలాంటి వాహనాలు లేకపోవడంతో 108 అంబులెన్సుకు సమాచారం ఇచ్చారు. 108 లో గర్భిణీని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో ప్రసవం జరిగి విజయ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

108 లో ప్రసవం సురక్షితంగా జరగడంతో 108 సిబ్బంది ఈఎంటీ శ్రీహరి, పైలట్ నరేష్ లకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అదే అంబులెన్స్ లో తల్లి, శిశువును సురక్షితంగా మెదక్ మాత, శిశు అసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు వైద్య పరీక్షలు చేయగా తల్లీ బిడ్డలు ఆరోగ్యవంతంగా ఉన్నట్లు తెలిపారు. గర్భిణీ పురిటి నొప్పులు ఎక్కువ అవుతున్నాయని గమనించి అంబులెన్సులోనే సమయస్ఫూర్తితో ప్రసవం చేసిన సిబ్బందిని పలువురు అభినందించారు.

Tags:    

Similar News