హరీష్ రావును రాజీనామా చేయమని అడిగే హక్కు కాంగ్రెస్‌కు లేదు: మేడే రాజీవ్ సాగర్

ఎమ్మెల్యే హరీష్ రావును రాజీనామా చేయాలని అడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్

Update: 2024-07-19 16:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్యే హరీష్ రావును రాజీనామా చేయాలని అడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ అన్నారు. హరీష్ రావు 6 గ్యారెంటీల్లోని 13 హామీలు, రైతు రుణమాఫీ చేస్తే రాజీనామాకు సిద్ధమని, చేయకపోతే రాజీనామాకు సీఎం రేవంత్ సిద్దమా..? అని సవాల్ విసిరితే స్వీకరించే దమ్ము సీఎంకు లేదని దుయ్యబట్టారు. 8 మాసాలు గడుస్తున్నా ఒక్క గ్యారెంటీని కూడా సంపూర్ణంగా అమలు కాలేదన్నాదని మండిపడ్డారు. శుక్రవారం మీడియా ప్రకటన విడుదల చేశారు.

రైతు రుణమాఫీ పేరుతో రైతు బంధు పథకానికి స్వస్తి పలికేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో రైతాంగ సంక్షేమానికి రూ.లక్షా 20 వేల కోట్లు కేటాయించిందన్నారు. దాదాపు 40 లక్షల పై చిలుకు రైతులు లక్ష లోపు పంట రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందికే మాఫీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. డిసెంబర్ 9న ప్రతి ఒక్క రైతుకు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి గద్దెకెక్కిన తరువాత కొర్రీలు పెడుతూ రైతుల సంఖ్యను తగ్గిస్తుందని మండిపడ్డారు. ఆగస్టు 15 లోపు 6 గ్యారంటీల్లోని 13 అంశాలను అమలు చేసి మిగతా రూ.25 వేల కోట్ల రుణ మాఫీ చేసి రాజీనామాపై మాట్లాడాలని సూచించారు. 


Similar News