Harish Rao:‘రైతులను దగా చేసి విజయోత్సవాలా?’.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో కాంగ్రెస్(Congress), బీఆర్‌ఎస్ నేత(BRS Leader)ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

Update: 2024-11-27 14:41 GMT

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్(Congress), బీఆర్‌ఎస్ నేత(BRS Leader)ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేపట్టిన విజయోత్సవాలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత(BRS Leader) హరీష్ రావు(Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) చేపట్టనున్న రైతు పండుగ విజయోత్సవాల పై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఈ క్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ.. రైతులను దగా చేసి పండుగ పేరిట విజయోత్సవాలా? రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. మీ ఏడాది పాలనలో 563 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినందుకు పండుగ చేస్తున్నావా? అని మండిపడ్డారు. వరంగల్ రైతు డిక్లరేషన్(Warangal Rythu Declaration) హామీలు అమలు చేయనందుకు ఉత్సవాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ చేస్తానని సగం మందికి మొండిచేయి చూపించారు. ఏడాదిలో రైతులకు రూ.40,800 కోట్లు బాకీ పడ్డారు. ఇవన్నీ చెల్లించి పండుగ చేసుకోవాలి అని హరీష్ రావు హితవు పలికారు.

Tags:    

Similar News