లోక్‌సభ బరిలో మంద కృష్ణ మాదిగ.. ఆ సెగ్మెంట్‌ నుంచి బీజేపీ టికెట్ ఆఫర్..!

మాదిగల ఓట్లే లక్ష్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన బీజేపీ.. ఇప్పుడు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పార్లమెంట్ బరిలో నిలపాలని నిర్ణయించినట్లు తెలిసింది.

Update: 2023-12-24 02:09 GMT
లోక్‌సభ బరిలో మంద కృష్ణ మాదిగ.. ఆ సెగ్మెంట్‌ నుంచి బీజేపీ టికెట్ ఆఫర్..!
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: మాదిగల ఓట్లే లక్ష్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన బీజేపీ.. ఇప్పుడు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పార్లమెంట్ బరిలో నిలపాలని నిర్ణయించినట్లు తెలిసింది. వరంగల్ స్థానం నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో గంపగుత్తగా మాదిగ ఓట్లన్నీ బీజేపీకి పడతాయని ఆ పార్టీ భావిస్తున్నది. రిజర్వుడ్ స్థానాల్లో కాషాయ జెండా ఎగరేయాలని ప్లాన్ చేస్తున్న బీజేపీ.. అందులోభాగంగా మందకృష్ణను బరిలో నిలపాలని నిర్ణయించినట్లు సమాచారం.

రిజర్వుడ్ స్థానాల్లో గెలిచేలా..

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17 స్థానాలు ఉండగా, అందులో కనీసం పదింటిలో గెలిచేలా బీజేపీ ప్రణాళికలు రచిస్తున్నది. ముఖ్యంగా ఎస్సీ రిజర్వుడ్ స్థానాలైన వరంగల్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, ఎస్టీ రిజర్వుడ్ స్థానాలైన ఆదిలాబాద్, మహబూబాబాద్ లో విజయం సాధించాలనుకుంటున్నది. అందులో భాగంగా మందకృష్ణను బరిలో నిలిపితే మాదిగల ఓట్లు పార్టీకి కలిసి వస్తాయని ఆ పార్టీ భావిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినా.. ఎస్సీ రిజర్వుడ్ స్థానాల్లో బీజేపీకి భంగపాటు తప్పలేదు. దీంతో ఈసారి ఏకంగా మందకృష్ణను రంగంలోకి దింపాలని ఆ పార్టీ భావిస్తున్నది.

Tags:    

Similar News